శివశక్తి నగర్ కాలనీ ఆర్చ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: డిసెంబర్ 24(భారత్ కి బాత్)
ఎల్ బి నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని శివశక్తి నగర్ వాసులు ఏర్పాటు చేసుకున్న కాలనీ ఆర్చ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఉంటూ కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావడం చాలా సంతోషనీయమని తెలిపారు. కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని తెలపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, నాయకులు గంగాని శ్రీను, ఎర్రవెల్లి సత్యనారాయణ, వెంకటేష్, కాలనీ అధ్యక్షులు ఎర్ర శ్రీకాంత్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఆంజనేయులు, ప్రకాష్, పుల్లయ్య, ఉపేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.