తెలంగాణ సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు ను హైదరాబాద్ లో నిర్వహించారు.
తెలంగాణ సమాచార హక్కుల చట్టం అవగాహన సదస్సు 18.12.2023 రోజు చైతన్యపురి లో నిర్వహించడం జరిగింది. జిల్లాస్థాయి కార్యకర్తలు ఈ అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. దీనికి ముఖ్య అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త గారు, వ్యవస్థాపక అధ్యక్షులు డా. యర్రమాద కృష్ణారెడ్డి మరియ కార్యకర్తలు పాల్గొన్నారు.
సమాచారం పొందడం ప్రజలందరి హక్కు అని, ప్రజలందరు సమాచార హక్కులను వినియోగించుకోవడం ప్రజల బాధ్యత అని ముఖ్య అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త గారు గుర్తుచేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు డా. యర్రమాద కృష్ణారెడ్డి గారు కార్యకర్తలకు సమాచారం పొందడానికి దరఖాస్తు పద్దతిని, అప్పీలు, తనిఖీలు,రుసుములు, సెక్షన్ వివరాల గూర్చి వివరించారు మరియు దానికి సంబంధించిన కిట్ ను అందచేశారు. తరువాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైద్రాబాద్ లో నిర్వహించిన సుపరిపాలన దిశలో…తెలంగాణ అనే అంశం పై సమాచార హక్కు చట్టం ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన కమీషనర్ డా. వర్రే వెంకటేశ్వర్లు మాట్లాడుతు సమాచార హక్కు ప్రతి ఒక్కరి హక్కు అని ఈ చట్టాలు ఎప్పటి నుంచి ప్రారంభమైనది వీటి విధి విధానాల గురించి వివరించారు. RTD ఇంజనీర్ -ఇన్- చీఫ్ (పంచాయతీ రాజ్ శాఖ)శ్రీ MA కరీం, గారు, అడ్వాకేట్ శ్రీధర్ గారు , SHVS బాధ్యులు,సభ్యులు పాల్గొన్నారు మరియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.