మోదీ(బిజెపి) వెంటే మేము: అచ్చంపేట యువత
బిజెపిలో భారీగా చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు
అచ్చంపేట: మార్చి 27(భారత్ కి బాత్)
బుధవారం నాడు అచ్చంపేట పట్టణంలోని చంద్రారెడ్డి గార్డెన్లో జరిగిన భారతీయ జనతా పార్టీ అచ్చంపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో నాగర్ కర్నూల్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన అచ్చంపేట మండలం బొమ్మన్ పల్లి, సిద్ధాపూర్, సింగారం గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి స్వాగతించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రాములు.
ఈ సందర్భంగా మాట్లాడిన పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై, ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని, లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.