ఆరెకటిక సోదరులని ఆదుకోవాలి: గౌలికార్ లాలాజీ
రంగారెడ్డి: ఫిబ్రవరి 19(భారత్ కి బాత్)
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ ప్రశాంతి హిల్స్ లో గల గౌలికార్ లాలాజీ మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి గానీ మా ఆరెకటిక సోదరులని ఏ ప్రభుత్వం కూడా ఆదుకోవడం లేదని, గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకుంటామని చెప్పారే కానీ, ఆచరణ మాత్రం శూన్యమని అన్నారు. దయచేసి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వమైన సరే మా ఆరెకటికలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆరెకటిక సోదరులకి బీఫామ్ ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలను కోరుతున్నానన్నారు. తెలంగాణ సామాజికంలో మేము చాలా వెనకబడిపోయామని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన మా ఆరెకటికలకు 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ఆరెకటిక సోదరులలోనే ఎవరినైనా చైర్మన్ గా నియమింపజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్న మా ఆరెకటికలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నామన్నారు.