అంజలప్ప కుటుంబ సభ్యులకు చెక్కులు అందచేసిన రాచకొండ పోలీసు కమిషనర్
రంగారెడ్డి: ఫిబ్రవరి 2(భారత్ కి బాత్)
శుక్రవారం నాడు రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం (నేరేడ్ మెట్) నందు జి. సుధీర్ బాబు ఐపిఎస్, రాచకొండ పోలీసు కమిషనర్, అనారోగ్యంతో మరిణించిన ఎస్బిఐ కంట్రోల్ రూం హెడ్ కానిస్టేబుల్ అంజలప్ప కుటుంబ సభ్యులకు భద్రత నుండి 8 లక్షల రూపాయల చెక్కులు (భార్య లక్ష్మీకు 4 లక్షలు, కూతురు గాయత్రికి 2 లక్షలు) ఇవ్వడం జరిగింది. వీరికి పెన్షన్, ఉద్యోగం త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.