మృతురాలి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 ఆర్థిక సాయం
కడ్తాల్: జనవరి 17(భారత్ కి బాత్)
కడ్తాల్ మండలంలోని గుర్లకుంట తండాకు చెందిన పాత్లావత్ హున్ని బుధవారం నాడు ఉదయం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే గుర్లకుంట తండా చేరుకొని హున్ని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హున్ని కుటుంబ సభ్యులకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపిటిసి లచ్చిరాం నాయక్, మంజుల, చంద్రమౌళి, గోపాల్, ప్రియ, రమేష్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, లోకేష్ నాయక్, భారతమ్మ, నరసింహ గౌడ్, రైతు కోఆర్డినేటర్ వీరయ్య, ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడు రాఘవేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.