బస్తీ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 26(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శనివారం నాడు మార్నింగ్ వాక్ లో భాగంగా డివిజన్ లోని హయత్ నగర్ పాత గ్రామం వార్డు ఆఫీసు పరిసరాల్లో పర్యటించి, బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బస్తీ వాసులు వార్డు ఆఫీసు పక్కన ఉన్న వీధిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బస్తీలోని పలు సమస్యలను కార్పొరేటర్ కి వివరించగా కార్పొరేటర్ స్పందించి, అధికారులతో సమీక్షించి ఒక్కొక్కటిగా బస్తీలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు బండారి రవి, అంజయ్య, లక్ష్మణ్, రాము, జఫ్ఫార్, మహేష్, రాములు, యాదయ్య, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.