గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తా: ఎలుగంటి మధుసుధన్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎలుగంటి మధుసుధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ్యులు కాలే యాదయ్య, బయ్యని మనోహర్ రెడ్డి, తుర్కయంజల్ మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, టియుఎఫ్ఐడీసీ చైర్మన్ చల్ల నర్సింహ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు శాసనసభ్యులు బయ్యాని మనోహర్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య లకి కమిషనర్ జి. రఘుతో కలిసి ఘనస్వాగతం పలికి వారిని సత్కరించారు.