భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికై వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 15(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శివారు కాలనీలలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయానికి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అందరితో కలిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శివారు కాలనీలలో అతి త్వరలోనే భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించనట్లయితే కాలనీ సభ్యులందరం కలిసి నిరాహార దీక్ష చేస్తామని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజగోపాల్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నందకిషోర్, చిత్రంజన్, శ్రీశైలం, సత్యనారాయణ, యాదిరెడ్డి, రమేష్ కుమార్, రాజు గౌడ్, పాండు రంగారెడ్డి, యాదయ్య, శశికాంత్, మాజీ అధ్యక్షులు సంజీవరెడ్డి, రవికుమార్, సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణ, దేవేందర్, శర్మ, వెంకటేష్, కాలనీ సంక్షేమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.