Search for:
  • Home/
  • क्षेत्र/
  • మాజీ వైస్ ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సిహెచ్ భాస్కర్ చారి

మాజీ వైస్ ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సిహెచ్ భాస్కర్ చారి

రంగారెడ్డి: అక్టోబర్ 14(భారత్ కి బాత్)

 

అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ వైస్ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డి గత నాలుగు రోజుల నుండి అనారోగ్యం బారిన పడి యషోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకొని, అక్కడికి వెళ్లి శ్రీధర్ రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పరామర్శించారు. అనంతం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ సందర్భంగా కొలను శ్రీధర్ రెడ్డికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మాజీ సర్పంచ్ లు చిత్తరి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, కళ్లెం లింగ రెడ్డి, రాము యాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required