కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న దేప భాస్కర్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 8(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వార్డ్ మెంబర్ కీసరి యాదిరెడ్డి ఆహ్వానం మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం నాడు భవాని సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు మస్న రవి కుమార్, కౌన్సిలర్ యాదగిరి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పందుల వెంకటేష్ గౌడ్, కందుకూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.