వనస్థలిపురంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు 2024
రంగారెడ్డి: సెప్టెంబర్ 3(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ లోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్ఆర్ డిస్టిక్ వారి సౌజన్యంతో సీనియర్ సిటిజన్ ఫోరం బిల్డింగ్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 25 మంది రక్తదాతలు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రెటరీ నాగభూషణo హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం వలన బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, క్యాన్సర్ ముప్పు తొలుగుతుందని, కొత్త రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని, గుండె జబ్బులను నివారిస్తుందని, కాలేయం పనితీరు మెరుగుపడుతుందని, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలియజేశారు. ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు, నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన ఆరోగ్యము మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ సూరిశెట్టి నరసింహ గుప్త, జాయింట్ ట్రెజరర్, ఇంటర్నేషనల్: మర్యాల చంద్రమౌళి గుప్త, వాసవి క్లబ్ సభ్యులు, రీజనల్ చైర్మన్ జి. నరసింహులు, రీజనల్ సెక్రెటరీ ఆర్. శ్యాంసుందర్రావు, వైస్ ప్రెసిడెంట్ విట్టా దూరయ్య, జాయింట్ చైర్ పర్సన్ ఎం. శివ నాగేశ్వరరావు, లక్ష్మీ ఆనంద్ కుమార్, డిస్టిక్ ఆఫీసర్స్ విట్టా సాయి మోహన్, బాదం జగదీశ్వర్, సెన్సార్ బోర్డు సభ్యులు పి. కృష్ణాదిశేషులు తదితరులు పాల్గొన్నారు.