Search for:
  • Home/
  • क्षेत्र/
  • బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా- తిరంగా యాత్ర

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా- తిరంగా యాత్ర

తిరంగా యాత్రలో పాల్గొన్న వేలాదిమంది యువతీ, యువకులు

 

హైదరాబాద్: ఆగష్టు 14(భారత్ కి బాత్)

 

78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర వేడుకలను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియం పిస్తా హౌస్ నుండి చార్మినార్ వరకు వేలాది మంది యువతీ, యువకులతో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ తిరంగా యాత్ర ద్వారా భారత ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం తోడ్పడుతుందని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సొంత రక్తసంబంధీకులనైనా క్షమించేది లేదన్నారు.

బీజేవైఎం కార్యకర్తలు, ప్రజలు హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటిపై భారత జెండా ఎగురవేయాలని, తిరంగా యాత్రలు నిర్వహించాలని ఈ సందర్బంగా పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కాంటేకర్ భగీరథ్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సామల పవన్ రెడ్డి, గణేష్, సురేష్, ఉప అధ్యక్షులు మహేష్, తరుణ్, చితరంజన్, రాజశేఖర్ శర్మ, కోశాధికారి యోగిరాజ్ , కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, సుధీంద్ర శర్మ, ఆదిత్య, అరవింద్, సంతోష్, శ్రీనాథ్, కోమలి నాయక్, అనిత, ప్రియాంక, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, నితిన్, యాదిష్, పవన్, ప్రవీణ్, కార్యకర్తలు భారీగా యాత్రలో పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required