Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఎల్బీనగర్ లో నూతనంగా ప్రారంభమైన సధర్మ ప్రాజెక్ట్స్

ఎల్బీనగర్ లో నూతనంగా ప్రారంభమైన సధర్మ ప్రాజెక్ట్స్

రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)

 

ఎల్బీనగర్ నియోజకవర్గం రింగ్ రోడ్ కి అతి సమీపంలో సూర్యోదయ కాలనీలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏకస్వామి రేసు, కొమ్మగాని యాదగిరిల నేతృత్వంలో శనివారం నాడు సధర్మ ప్రాజెక్ట్స్ ను బంధుమిత్రులు, మార్కెటింగ్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ తాము హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఘట్కేసర్ సమీపంలోని ఎదులాబాదులో ఏడు ఎకరాలలోని తమ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ లో ఓపెన్ ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, ఎల్బీనగర్ బిజెపి సీనియర్ నేత కొత్త రవీందర్ గౌడ్, తుర్కయంజాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, బూర మల్సూర్ గౌడ్, ముద్దగౌని లక్ష్మీప్రసన్న, వజీర్ ప్రకాష్, నోముల దయానంద్ గౌడ్, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారిని అభినందించారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required