Search for:
  • Home/
  • क्षेत्र/
  • పేదింటి నిర్మాణానికి చేయూతనందించిన రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

పేదింటి నిర్మాణానికి చేయూతనందించిన రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

రంగారెడ్డి: ఏప్రిల్ 30(భారత్ కి బాత్)

 

కడ్తాల్ మండల కేంద్రంలోని రెండవ వార్డుకు చెందిన మంగళపల్లి మహేష్ ఇంటి నిర్మాణానికి కావలసిన 30 సిమెంట్ బస్తాలను రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి పేద కుటుంబానికి అందించిన ట్రస్ట్ చైర్మన్, మండల జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్. ఈ సందర్భంగా జెడ్పిటిసి దశరథ్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ నుండి ఎల్లవేళలా మా సేవలు కొనసాగుతాయని, అదేవిధంగా రాబోవు కాలంలో మరింత విస్తృతంగా మా సేవలను ప్రతి నిరుపేద కుటుంబాలు, ప్రతి ఇంటికి సేవ చేసే విధంగా మా సేవలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు అధ్యక్షులు బాలకృష్ణ పవన్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కొప్పు కృష్ణ, నాయకులు నరేష్ యాదవ్, కంబాల పల్లి అంజి, సురేష్, మహేష్, రాజశేఖర్, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required