కార్యాచరణ కమిటీని నియమించిన మేరు సంఘం
రంగారెడ్డి: ఏప్రిల్ 2(భారత్ కి బాత్)
ఎన్నికలకు ముందు జేఏసీకి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ కు కృతజ్ఞత సభ సన్నాహలలో భాగంగా మంగళవారం నాడు ఎల్. బి. నగర్ నియోజకవర్గ సమావేశo జేఏసీ కన్వీనర్ మునిగాల రాము అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో కార్యాచరణ కమిటీ సభ్యులను నియమించి, నియామక పత్రం అందించడం జరిగింది. ఎల్. బి. నగర్ నియోజకవర్గం ఇంచార్జిగా కొత్తకొండ శ్రీనివాస్ ని, సభ్యులుగా శీలం నగేష్, దికొండ శ్రీనివాస్, మేడిగ రాంబాబు, రేణుకుంట్ల రఘుని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మునగాల రాము, జేఏసీ వ్యవస్థాపకులు మునిగాల రమేష్, జేఏసీ కో-కన్వీనర్ మేడిగ సంతోష్, కొత్తకొండ పురుషోత్తం, మాడిశెట్టి యాదగిరి, ఎల్. బి. నగర్ నియోజకవర్గ మేరు కులస్తులు పాల్గొని విజయవంతం చేశారు.