Search for:
  • Home/
  • क्षेत्र/
  • పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఇద్దరు అనాధ అమ్మాయిలకు, ఇద్దరు వికలాంగుల కూతుళ్ల వివాహనికి ఉప్పల ఫౌండేషన్ చేయూత

 

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒకేరోజు నలుగురు అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళం

 

హైదరాబాద్: మార్చి 21(భారత్ కి బాత్))

 

నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిలు రుచికా, మల్లేశ్వరి, శ్రావణి, మౌనిక, వారి కుటుంబ సభ్యులు గురువారం నాడు ఉదయం హైదరాబాద్, నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి తెలుసుకొని, వారికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళంగా ఇవ్వడం జరుగుతున్నదని, ఈ విరాళం ఒక్క పేద ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా అన్ని కులాలవారికి, అన్ని ప్రాంతాల నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లి కోసం పుస్తె, మెట్టెలు, చీర, గాజులు సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో నలుగురు పెళ్లి కూతుర్లు, వారి కుటుంబ సభ్యులు, కోటగిరి చంద్ర శేఖర్, సునీత, యాదయ్య, స్వరూప, మల్లేష్, వెంకటేష్, చంద్రశేఖర్ గుప్తా జర్నలిస్ట్, ఎం శంకర్ గుప్తా, చంద్రశేఖర రావు, మల్లేష్ తదితరులు ఉన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required