పోతుగంటి భరత్ ప్రసాద్ ని సన్మానించిన కిషన్ రెడ్డి, తల్లోజు ఆచారి
హైదరాబాద్: మార్చ్ 7(భారత్ కి బాత్)
హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, జక్క రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి కలసినారు. అదేవిధంగా కిషన్ రెడ్డి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.