గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి: యుగ తులసి ఫౌండేషన్
హైదరాబాద్: ఫిబ్రవరి 27(భారత్ కి బాత్)
గోవుల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు, కబేళాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గో రక్షకులు డిమాండ్ చేశారు. యుగ తులసి ఛైర్మెన్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శివకుమార్ ఆధ్వర్యంలో ఎమరాల్డ్ స్వీట్ హౌజ్ అధినేత విజయ రామ్, ఇస్కాన్ ప్రతినిధి చైతన్యలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని కలిసి, ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ పాయింట్స్ నుండి నగరoలోని కబేళాలకు గోవులను ఏ విధంగా తరలిస్తున్నారన్నది ఆధారాలతో సహా వివరించామని తెలిపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా, గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా, కొంత మందిలో కూడా మార్పు రావట్లేదని వారు సీపీ దృష్టికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన సీపీ తక్షణమే అన్ని పోలీస్ స్టేషన్ ల సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.