పాదయాత్రలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్
హయత్ నగర్ డివిజన్ లోని సుభద్ర నగర్ కాలనీ సంక్షేమ సంఘం వారు ఆదివారం నాడు కాలనీ సమస్యలపై నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.