ఆమనగల్లు నూతన సీఐ విజయ్ కుమార్ ని సన్మానిస్తున్న విజయ్ రాథోడ్
రంగారెడ్డి: ఫిబ్రవరి 21(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండల పోలీస్ స్టేషన్ కి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ ని ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి, సీఐ విజయ్ కుమార్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రతీ ఒక్కరూ తమకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ రాథోడ్ తో పాటు రాజ్ కుమార్ కూడ పాల్గొన్నారు.