ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా
మేడ్చల్: జనవరి 11(భారత్ కి బాత్)
మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, అమావాస్య సందర్భంగా దాదాపు 500 మందికి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యము అని, వైద్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. బిపి, షుగర్ ఉన్నవాళ్లు దాదాపు 200 మంది ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారని తెలిపారు.