ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
కల్వకుర్తి: జనవరి 9(భారత్ కి బాత్)
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఆమనగల్లు మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే మార్గంలో ముందుకు సాగాలని తెలిపారు. అధికారులు నీతి నిజాయితితో పనిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరు గ్యారెంటీల ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ఐదు సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంత రెడ్డి, ఎంపీడీఓ ఫారూఖ్ హుస్సేన్, ఎంఆర్ఓ గిరిజ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.