బీసీ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాను: తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జీ
షాద్ నగర్: అక్టోబర్ 29(భారత్ కి బాత్)
షాద్ నగర్ లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కళ్యాణ్ కార్ జాంగిర్ జీ కి బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు కాడి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం నాడు నియమాక పత్రం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ జాంగిర్ జీ మాట్లాడుతూ తన బాధ్యతను బీసీ అభివృద్ధికి సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన సందర్భంగా బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు కాడి శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలియజేశారు.