ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బధ్యానాధ్ చౌహన్ కు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ రాథోడ్
రంగారెడ్డి: జనవరి 3(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండలం ఎక్సైజ్ శాఖ సీఐ బధ్యానాధ్ చౌహన్ ని, ఆమనగల్లు మండలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కే ఎన్ ఆర్ యువసేన జిల్లా నాయకుడు విజయ్ రాథోడ్ మర్యాదపూర్వకంగా బుధవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా సీఐ బధ్యానాధ్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైరాం నాయక్, రాజ్ కుమార్, మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.