Search for:
  • Home/
  • क्षेत्र/
  • అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ భిక్షపతి చారి

అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ భిక్షపతి చారి

రంగారెడ్డి: అక్టోబర్ 6(భారత్ కి బాత్)

 

దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం నాడు తిరుమలా హిల్స్ కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజలో పాల్గొన్న 27 డివిజన్ కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి మరియు కాలనీ ప్రధాన కార్యదర్శి పాలెం నరేందర్ గౌడ్. అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ కి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీవాసులందరికి అన్నపూర్ణమ్మ దేవి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, దేవి నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి విక్రమ్ కుమార్(విక్కి), కృష్ణా రెడ్డి, ధన్ రాజ్, కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required