బాచారంలోని ఎన్ఎం కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 6(భారత్ కి బాత్)
అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బాచారం గ్రామ పరిధిలోని ఔటర్ రింగురోడ్డు సమీపంలో నడికుడం వరప్రసాద్ నేతృత్వంలోని ఎన్ఎం కన్వెన్షన్ హాల్ ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ తన తండ్రి నడికుడం మురహరి పేరు మీద ఎన్ఎం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.