Search for:
  • Home/
  • Uncategorized/
  • అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)


ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని కొత్తపేట మారుతి నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 వ రోజు వేలాదిమంది అయ్యప్ప మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు వడ్డించడమే కాకుండా, అయ్యప్ప స్వాములతో పాటు సహపంతిలో కూర్చొని భోజనం చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, వెంకన్న, నారాయణ, రాజు, పవన్ ఇంకా చాలా మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో చేస్తున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమంలో ఎంతో సేవ చేస్తున్న మొగుళ్లపల్లి ఉపేందర్ ను కొనియాడారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. అదేవిధంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఎంతో మంది అయ్యప్ప స్వాముల 41 రోజుల భిక్ష కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుతున్న ప్రేమ్ కుమార్ గుప్తను అభినందించారు.

 

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required