Search for:
  • Home/
  • क्षेत्र/
  • వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన డాక్టర్ విజన్ కేర్ ఆప్టికల్స్

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన డాక్టర్ విజన్ కేర్ ఆప్టికల్స్

ఎల్. బి. నగర్: మే 12(భారత్ కి బాత్)

 

వనస్థలిపురం శాంతినగర్ కాలనీలో డాక్టర్ విజన్ కేర్ ఆప్టికల్స్ సేవలు ఆదివారం నాడు అందుబాటులోకి వచ్చాయి. ఈ షాప్ ను నిర్వాహకులు మూల మహేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ ధరలో అందరికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో విజన్ కేర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు 20% రాయితీని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత కంటి పరీక్ష నిర్వహించినట్లు నిర్వాహకులు మూల హరీష్ గౌడ్ వెల్లడించారు. కంటి అద్దాలకు వన్ ప్లస్ వన్ రాయితీ ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ గౌడ్, శివ శంకర్ గౌడ్, బాలరాజు, బుర్ర సంజీవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required