వైద్య వృత్తి చాలా గొప్పది: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
రంగారెడ్డి: మార్చి 23(భారత్ కి బాత్)
తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, జయవీర్ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ శాసన సభ్యులు కె.స్. రత్నం తో కొండేటి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కే.ఎల్.ఆర్ మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్ప వృత్తి అని అన్నారు. వైద్యులు మానవనీయ కోణంలో ప్రజలకు సేవ చేయాలన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ కార్డు,108,104 ను ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు జంగారెడ్డి, సత్యనారాయణ, పాండు రంగారెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, చిన్నా రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.