జహీరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పైడి ఎల్లారెడ్డి
జహీరాబాద్: మార్చి 20(భారత్ కి బాత్)
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన డా. పైడి ఎల్లారెడ్డి. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం సీటును, బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ సారధ్యంలో దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగ వంతం చేసారని, 10 సంవత్సరాల నుండి దేశం ఆర్థికంగా అడుగులు పడ్డాయని అన్నారు. మూడో సారి మోడీ సర్కార్ ని ఏర్పాటు చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.