ఆలయ నిర్మాణానికి రూ. 50.000 విరాళం అందజేసిన మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్
రంగారెడ్డి: మార్చి 20(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం ఆలయానికి మేడిగడ్డ తండా గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ఆలయ నిర్మాణానికి 50.000 వేల రూపాయలతో 6 వేల ఇటుకల లారీ లోడు సామగ్రిని విరాళంగా అందించినారు. ఈ సందర్భంగా మల్లేష్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలని, అన్ని కులాల వారు, మతాల వారు కలిసి మెలిసి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో స్నేహ పూర్వకంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబర్ సింగ్, మాజీ వార్డు మెంబర్ శంకర్, గ్రామ నాయకులు, శీవి శంకర్, మణిపాల్, రమేష్, శ్రీను, రాజేష్, పాప తదితరులు పాల్గొన్నారు.