బి.యన్.రెడ్డిలో నూతనంగా ప్రారంభమైన సెకండ్ క్విక్ వాక్ ఫిజియోథెరపీ అండ్ రెహబిలిటేషన్ సెంటర్
రంగారెడ్డి: మార్చ్ 3(భారత్ కి బాత్)
ఆదివారం నాడు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేస్ 1 లో నూతనంగా సెకండ్ క్విక్ వాక్ ఫిజియోథెరపీ అండ్ రెహబిలిటేషన్ సెంటర్ ను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్, జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, నాగోల్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్, గుర్రంగూడా కార్పొరేటర్ లక్ష్మారెడ్డిలు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యజమానులు డా. నాగరాజు, డా. కృపాల్, డా. మహేష్ మరియు పార్టీ ఉపాధ్యాయుల మోర్చా కన్వీనర్ భూపాల్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం సెక్రటరీ పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.