పదవి అలంకారం కాదు బాధ్యత: కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్
రంగారెడ్డి: ఫిబ్రవరి 1(భారత్ కి బాత్)
ప్రజాప్రతినిధులు తమ పదవి కాలంలో సంక్షేమ అభివృద్ధికి పాటుపడటంతో పాటు నిత్యం అందుబాటులో ఉంటేనే ప్రజా మన్ననలు పొందగలుగుతారని కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ అన్నారు. గురువారం నాడు ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నేటితో ఐదు సంవత్సరాలు, సర్పంచుల పదవీకాలం ముగిసినందున వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అంబర్ సింగ్, ఉపసర్పంచ్ మల్లేష్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్ రాథోడ్ మాట్లాడుతూ పదవి అలంకారం కాదని బాధ్యత అని గుర్తు చేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి చేసిన సేవలు ఎన్నో గొప్ప పనులు ఉన్నాయన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డారన్నారు. చేసిన పనులకు బిల్లులు వచ్చినా, రాకున్నా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగారని కొనియాడారు. అనంతరం గ్రామ యువకులు కలిసి సర్పంచ్, ఉపసర్పంచ్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, జైరాం, సిమ్రాన్, కుమార్, మల్లేష్, నందు, హేమ, కిషన్, రఘు, రాజేష్, పాండు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.