Search for:
  • Home/
  • क्षेत्र/
  • ప్రేరణ హిందీ ప్రచారణి సభ మరియు ఎస్ హెచ్ ఎం వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమం

ప్రేరణ హిందీ ప్రచారణి సభ మరియు ఎస్ హెచ్ ఎం వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమం

రంగారెడ్డి: సెప్టెంబర్ 24(భారత్ కి బాత్)

చేవెళ్ల నియోజకవర్గం సన్ సిటీ కిస్మత్ పూర్ మాధవి నగర్ లో ప్రేరణ హిందీ ప్రచారణి సభ మరియు ఎస్ హెచ్ ఎం వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమం మంగళవారం నాడు శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో హిందీ భాష ప్రచారం చేసినందుకుగాను హిందీ భాషా ప్రేమికులకు హిందీ సేవి సమ్మాన్ 2024 ప్రేరణ హిందీ ప్రచారణి సభ – భారత్ ద్వారా సన్మాన పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందీ సన్మాన పత్రాలు అందుకున్న వారు కె. రోజా(రంగారెడ్డి), ఎన్. శ్రీకాంత్ రెడ్డి(వరంగల్), కె. విద్యారాణి(హైదరాబాద్), టి. సంగీత(రంగారెడ్డి), పి. సంతోష(హైదరాబాద్), కె. శివలీల(రంగారెడ్డి), జె. రాజు(నాగర్ కర్నూల్), పి. రాధిక(రంగారెడ్డి), కె. పోచయ్య(నల్గొండ). వీరు ఆయా జిల్లాలలో హిందీ ప్రచారం చేసినందుకుగాను హిందీ సన్మాన పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రేరణ హిందీ ప్రచారణి సభ – భారత్ వ్యవస్థాపకులు కవి సంఘం త్రిపాఠి(మధ్య ప్రదేశ్), రాష్ట్రీయ సలహాదారులు డా. గుండాల విజయ్ కుమార్ లు సన్మాన పత్రాలు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు. కవి సంఘం త్రిపాఠి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో హిందీ భాష ఇలానే విస్తృత ప్రచారం జరిగితే, దేశ ప్రధాన భాషగా హిందీ అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ హెచ్ ఎం వి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గుండాల విజయ్ కుమార్ పాటలు పాడి అలరించిన పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు ఫౌండేషన్ తరపున అందజేశారు. దేశానికి భాష గుండె వంటిదని, భాషలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని విజయ్ కుమార్ అన్నారు. శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో జరిగిన కార్యక్రమానికి సహకరించినందుకు స్కూల్ యాజమాన్యానికి మరియు టీచర్లు సౌజన్య, కళావతి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు బి. పాండు, కె. కిష్టయ్య, హరిలాల్, జ్యోతి, రాకేష్, చందు కార్యక్రమానికి సహకరించారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required