ఆటోనగర్లో బాంబే సర్కస్
హైదరాబాద్: మార్చి 29(భారత్ కి బాత్)
హైదరాబాద్ ఆటో నగర్ లో గ్రేట్ సర్కస్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు సంజీవ్ తెలిపారు. ఎల్బీనగర్ జింకల పార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన సర్కస్ ను శుక్రవారం 29 వ తేదిన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 25 రోజులపాటు కొనసాగే ఈ సర్కస్ లో అనేక రకాల విన్యాసాలతో పాటు శునకాలతో విన్యాసాలు ఉంటాయన్నారు. మిగతా సర్కస్లకు భిన్నంగా చైనా, రష్యా, ఇథియోపియా కళాకారులచే భయంకరమైన, ఒళ్ళు గగ్గోరు పొడిచే విన్యాసాలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు నిర్వాహకులు సంజీవ్ వెల్లడించారు. 1500 మంది వీక్షించే సర్కస్ లో ప్రేక్షకుల భద్రతకు పెద్దపీట వేయనన్నట్లు పేర్కొన్నారు. అగ్ని, జల, వాయు నిరోధక గుడారాలను వినియోగిస్తూ సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నట్లు తెలిపారు. టికెట్లు బుకింగ్ సదుపాయం కూడా ఉంటుందన్నారు. 8886033773/74/75/76 నెంబర్లలో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.ఓ. సంపత్ కూడా పాల్గొన్నారు.