నూతనంగా ప్రారంభమైన సన్ రైస్ ఐ కేర్ & ఆప్టికల్స్
రంగారెడ్డి: మార్చ్ 6(భారత్ కి బాత్)
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ లోని బి.డి. రెడ్డి గార్డెన్ లైన్ లోని టీచర్స్ కాలనీలో సన్ రైస్ ఐ కేర్ & ఆప్టికల్స్ ఎ. రామకృష్ణ నేతృత్వంలో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల దృష్టి లోపాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి తగిన స్పెక్ట్స్ అందిస్తామన్నారు. పేద, మధ్య తరగతి అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లోనే స్పెక్ట్స్ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై రామకృష్ణను అభినందించారు.