కాలనీ వాసులకు భూగర్భ డ్రైనేజీ సదుపాయం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: మార్చ్ 5(భారత్ కి బాత్)
హయత్ నగర్ డివిజన్లోని ఆనంద్ నగర్ కాలనీ, వసంత్ కాలనీలకు భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరైన సందర్భంగా మంగళవారం నాడు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి అధికారులతో కలిసి ఆయా కాలనీలలో లెవెల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వసంత్ నగర్, ఆనంద్ నగర్ కాలనీలలో వెంటనే భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.