Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుంటాను: ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుంటాను: ఉప్పల శ్రీనివాస్ గుప్త

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నియామక పత్రాల అందజేత

 

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా కమిటీ, పట్టణ కమిటీ సభ్యులుగా నూతన నియామకం

 

హైదరాబాద్: ఫిబ్రవరి 15(భారత్ కి బాత్)

 

ఐవిఎఫ్- అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా కల్వ శేషాద్రి, వికారాబాద్ జిల్లా పిఆర్ఓ గా డి. గురురాజ్, వికారాబాద్ జిల్లా కల్చరల్ కమిటీ సెక్రటరీ జి. గౌరీ శంకర్, వికారాబాద్ జిల్లా మీడియా కమిటీ ఇంఛార్జి కె. ప్రవీణ్ కుమార్, వికారాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ లు ఎమ్. రాజు కుమార్, దోమ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ ఎమ్. హరీష్ కుమార్, సేవాదల్ కమిటీ సెక్రటరీ ఆర్. సతీష్ కుమార్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ పట్టణ కమిటీ నూతన అధ్యక్షుడుగా కల్వ జగదీశ్వర్, వైస్ ప్రెసిడెంట్ గా పోల వంశీకృష్ణ, సెక్రటరీ జి. ప్రణయ్ చంద్ర, కోశాధికారిగా కల్వ సాయి, జాయింట్ సెక్రటరీ ఎమ్. రఘురాం నియామకం అయిన సందర్భంగా వారికి గురువారం నాడు హైదరాబాద్, నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంప్ కార్యాలయంలో ఐవిఎఫ్-ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి అవుతుందని, దేశ వ్యాప్తంగా 17 కోట్ల మంది వైశ్యుల పాపులేషన్ ఉందని, ఐవిఎఫ్ అన్ని రాష్ట్రాలలో ఉందని, అన్ని రకాలుగా పోరాడుతుందని అన్నారు. ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆర్యవైశ్య పేదలకు, ప్రజలకు అందేలా చేస్తానని, మెరిట్ సాధించిన పేదలకు స్కాలర్షిప్ ఇప్పిస్తామని అన్నారు. గ్రామ, రాష్ట్ర స్థాయిలో ఐవిఎఫ్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని, ఇక ముందు కూడా అలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, ఐఏఎస్ చదువుతున్న 35 మందికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అంతర్జాతీయ వైశ్య వైశ్య ఫెడరేషన్ యూత్ స్టేట్ జనరల్ సెక్రటరీ, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required