సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో అందరూ నడవాలి
మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో సేవాలాల్ మహరాజ్ 285 వ జయంతి వేడుకలు
రంగారెడ్డి: ఫిబ్రవరి 15(భారత్ కి బాత్)
బంజారాల ఆరాధ్య దైవ గురువు శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో నడవాలని ఆమనగల్లు మండల ఎంపీపీ అనిత విజయ్, మేడిగడ్డ తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్, కే.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ లు అని అన్నారు. ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో గురువారం నాడు సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి వేడుకలను మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సేవాలాల్ మహరాజ్ కి నైవేద్యంతో బొగ్ బండార్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్ సద్గురు సేవాలాల్ మహరాజ్ చూపించిన మార్గం ఆదర్శనీయమని, సేవాలాల్ మహరాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని, అభివృద్ధికి, తాండల నిర్మాణానికి సేవాలాల్ తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయన సేవలను కొనియాడారు. అలాంటి సేవాలాల్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిల్లర్ కృష్ణ, గిరిజన యువ నాయకులు హేమ, రాజ్ కుమార్, రాజ, నవీన్, హరిలాల్, గోపి, రాజు, సిద్దు, పవన్, మల్లేష్, హన్మ, దేశ్య, నందు, చిన్న, గణేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.