నియోజకవర్గ ప్రజలకు సేవకురాలిగా సేవ చేస్తా: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్ కె పురం ఖిలా మైసమ్మ దేవాలయం, కర్మాన్ ఘాట్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ వై ఆర్ గార్డెన్లో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిను చూసి గెలిపించిన ప్రజలందరికీ మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రానున్నది ఎన్నికల కాలమని, అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. నన్ను గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, కాలనీ, బస్తీల్లో పర్యటిస్తానని, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తానని, అందరికీ అండగా ఉంటానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సబితా ఇంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. వారందరికీ సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గములోని మహేశ్వరం, కందుకూరు మండలాల, జల్ పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీల, బడoగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్ల, సరూర్ నగర్, ఆర్కే పురం డివిజన్ల బిఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, జల్ పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు.