Search for:
  • Home/
  • क्षेत्र/
  • జెడ్పి రోడ్లో నూతనంగా ప్రారంభమైన ఐడియల్ కిచెన్

జెడ్పి రోడ్లో నూతనంగా ప్రారంభమైన ఐడియల్ కిచెన్

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)

 

ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లో పెట్రోల్ బంక్ లైన్లో నూతనంగా ఐడియల్ కిచెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. శివారెడ్డి ఐడియల్ కిచెన్ ను స్థాపించారు. దీని వ్యవస్థాపకులు శివారెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, అనంత్ రెడ్డి ఔట్ లెట్ ఫ్రాంచెస్ గా తీసుకొని నడిపిస్తున్నామని తెలిపారు. ఇచ్చట అన్ని రకాల టిఫిన్లు అందరికి అందుబాటులో ఉండే ధరలకే లభిస్తాయని అన్నారు. మా వద్ద కేసరి బాత్, కారాబాత్, పొంగనాలు, ఉగ్గాని మరియు బజ్జి, రాగి దోశ, కొర్ర దోశ, ఆకుకూర దోశ అలాగే చిన్నపిల్లలకి చాక్లెట్ దోశ, కోవా దోశ, చాక్లెట్ ఇడ్లీ లభిస్తాయని తెలిపారు. మా వద్ద ప్రత్యేకంగా బెల్లం పాయసం లభిస్తుందని పేర్కొన్నారు. ఆహారం అద్భుతంగానూ, హైజినిగ్గా కూడా ఉంటుందని అన్నారు. మా వద్దకి ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయాలని కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required