Search for:
  • Home/
  • क्षेत्र/
  • మధుయాష్కీ గౌడ్ కి తమ సమస్యలను వివరించిన మేరు జేఏసీ సంఘం

మధుయాష్కీ గౌడ్ కి తమ సమస్యలను వివరించిన మేరు జేఏసీ సంఘం

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మధుయాష్కి గౌడ్ 

 

రంగారెడ్డి: ఏప్రిల్ 5(భారత్ కి బాత్)

 

మేరు కుల వృత్తి దారుల టైలర్ వృత్తి పనిని ఏకరూప దుస్తుల టెండర్స్ ను డ్వాక్రా మహిళలకు కేటాయించడం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిందని జేఏసీ పేర్కొంది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ చేతి నిండా పనులు లేక వెనుక బడిన పేద మేరు కుల వృత్తి దారులకు స్కూల్ యూనిఫామ్ టెండర్స్ కొరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు మండల, జిల్లా విద్యా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మేరు కులస్తులు టైలర్ పనులు లేక పస్తులుండే కరువు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. పరిష్కారం కొరకు రాష్ట్ర మేరు జేఏసీని కలిసి ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరామని, అందుకు స్పందించిన మేరు జేఏసీ కాంగ్రెస్ మేనిఫెస్టో సభ్యులు మధుయాష్కీ గౌడ్ ని కలిసి మేరు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎంను కలిపించాలని మెమొరాండం సమర్పించి కోరడమైనదని అన్నారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి సామాజిక బీసీ మేరు కులస్తులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సీఎంతో మాట్లాడుతానని, సామజిక బీసీ కులాలకు ఎవరికీ అన్యాయం జరగకుండా అండగా ఉంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం అణగారిన కులాలను ఆదుకుంటుందని భరోసానిచ్చారు మధుయాష్కి గౌడ్. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మేరు కార్పొరేషన్ ఇచ్చినందుకు మా మేరు కులస్తుల అందరి తరుపున కృతజ్ఞతలు తెలిపిన మేరు రాము. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మునిగాల రాము మేరు, కో-కన్వీనర్ శాంతి కుమార్ నోముల, ఎల్బీనగర్ జేఏసీ ఇంఛార్జి సభ్యులు శీలం నగేష్, దీకొండ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required