పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నిట్టు శ్రీశైలం
రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్)
సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, నవతెలంగాణ ప్రజా పార్టీ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు చాడ సురేష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలంతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.