Search for:
  • Home/
  • क्षेत्र/
  • దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం: చాడా శ్రీనివాస్ రెడ్డి

దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం: చాడా శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ: ఫిబ్రవరి 23(భారత్ కి బాత్)

 

నల్గొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నాడు బిజెపి నల్గొండ పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ పార్లమెంట్ ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తారీఖు నాడు నల్గొండ పార్లమెంట్ దేవరకొండ నియోజకవర్గానికి డిండి మండలం బిజెపి విజయ్ సంకల్పయాత్ర ప్రారంభం అవుతున్నది కావున బిజెపి నాయకులు, కార్యకర్తలు, మోడీజీ అభిమానులు, జాతీయ వాదులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలు, విద్యార్థి నాయకులు ఈ యాత్రలో పాల్గొని దేశం కోసం మోదీ – మోదీ కోసం మనం అనే నినాదంతో ముందుకు సాగుతూ నల్గొండ పార్లమెంట్ లో బిజెపి జెండాని ఎగిరేసి నరేంద్ర మోడీకి బహుమతిగా పంపిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో-కన్వీనర్ తుక్కని మన్మధ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహా రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలూ నాయక్, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, యాత్ర ఇంచార్జ్ పోతుపాక సాంబయ్య, అసెంబ్లీ కన్వీనర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required