Search for:
  • Home/
  • क्षेत्र/
  • పేదింటి అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

పేదింటి అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

 

హైదరాబాద్: ఫిబ్రవరి 20(భారత్ కి బాత్)

 

హైదరాబాద్ లోని నాగోల్ లో మంగళవారం నాడు ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, చిత్తాపురం గ్రామానికి చెందిన పేద కుటుంబం ఎస్సీ కమ్యూనిటీ మంద ఎల్లమ్మ- చంద్రయ్యల కూతురు మౌనిక వివాహం సందర్భంగా వచ్చి కలిసినారు. అందులో భాగంగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని, అమ్మాయి వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు తరపు కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్త నీరూ, ఐవిఎఫ్ కొత్తపేట కోశాధికారి రజిత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required