సంతోష్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన స్పైస్ అరేబియన్ మండి
హైదరాబాద్: ఆగష్టు 24(భారత్ కి బాత్)
హైదరాబాదులోని సంతోష్ నగర్ లో శ్రీనివాస్ హాస్పిటల్ ఎదురుగా శుక్రవారం నాడు స్పైస్ అరేబియన్ మండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాకత్ పురా ఎమ్మెల్యే జనాబ్ మెహరాజ్ హుస్సేన్ సాహేబ్ పాల్గొనన్నారు. యజమానులు వెంకట్ శివ్ రామ్, వినయ్, ఉదయ్ లు మాట్లాడుతూ మా వద్ద చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి ఫుడ్ ఐటమ్స్ ప్రత్యేకంగా లభించునని తెలిపారు. పరిశుభ్రతకి, రుచికి, సుచికి ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. అలాగే ఆన్లైన్ డెలివరీ జొమాటో, స్విగ్గీ అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.